తమన్నాకి ఈ ‘ఐటెం’ సూట్ కాలేదా.?
- July 25, 2024
ఓ వైపు స్టార్ హీరోయిన్గా సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తోనూ ఆకట్టుకుంది అందాల తమన్నా. తమన్నా నటించిన స్పెషల్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ సాంగ్సే. అందులో నో డౌట్.
అయితే, తాజాగా తమన్నా నటించిన స్పెషల్ సాంగ్ ఒకటి దారుణంగా ట్రోల్ అవుతోంది. బాలీవుడ్లో ఆరేళ్ల క్రితం వచ్చిన ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమే ‘స్త్రీ 2’.
హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన ‘ఆజ్ కీ రాత్’ సాంగ్‌లో తమన్నా తన అంద చందాలతో నడుమొంపుల స్టెప్పులతో పిచ్చెక్కించేసింది.
అయితే, ‘స్తీ’ సినిమాలో నోరా ఫతేహి చేసిన ‘కమరియా’ సాంగ్‌తో పోల్చితే ఈ పాట పెద్దగా బాగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయ్. ఇంతవరకూ తమన్నా చేసిన ఏ స్పెషల్ సాంగ్‌కి సంబంధించి ఇలాంటి కంప్లైంట్స్ రాలేదు.
ఆ సంగతి అటుంచితే, అసలు ఏమ్ బాగా లేదా.. అంటూ ఈ సాంగ్ వీడియోని సెర్చ్ చేసే వాళ్ల సంఖ్య ఎక్కువైపోయింది. అలా ఈ పాట ట్రెండింగ్ అయిపోతోంది.
అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజకుమార్ రావు, పంకజ్ త్రిపాఠీ, అపర్ శక్తి ఖురానా, శ్రద్ధా కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







