ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- July 26, 2024
శ్రీలంక: సొంతగడ్డ పై జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో శ్రీలంక ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు (శుక్రవారం) జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్థాన్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో కెప్టెన్ చమరి ఆటపట్టు(63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరసింది. అనుష్కా సంజీవని(24 నాటౌట్), సుగంధిక కుమారిలు(10) అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
దంబుల్లా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ అమ్మాయిలు దంచేశారు. ఓపెనర్లు గుల్ ఫెరొజా(25), మునీబా అలీ (37)లు శుభారంభమిచ్చి పునాది వేశారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ నిడా దార్(23) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. ఆఖర్లో ఫాతిమా సనా(23 నాటౌట్), అలియా రియాజ్(16 నాటౌట్)లు ధనాధన్ ఆడటంతో పాక్ జట్ట అనూహ్యంగా 140 రన్స్ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







