చరిత్ర సృష్టించిన సౌదీ స్విమ్మర్ మషేల్ అల్-అయెద్

- July 29, 2024 , by Maagulf
చరిత్ర సృష్టించిన సౌదీ స్విమ్మర్ మషేల్ అల్-అయెద్

పారిస్: సౌదీ స్విమ్మర్ మషేల్ అల్-అయెద్.. లా డిఫెన్స్ ఎరీనాలోని ఒలింపిక్ పూల్‌లో 2:19.61 నిమిషాలతో 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్‌లో ఆరో స్థానంలో నిలిచి అల్ టైం బెస్ట్ టైమింగ్ తో ముగించింది. ఒలింపిక్ స్విమ్మింగ్‌లో సౌదీ అరేబియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా మషేల్ చరిత్ర సృష్టించింది. పారిస్ 2024 గేమ్స్‌లో పతకం గెలవాలని, లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని మషెల్ ఆకాంక్షించారు.

"పారిస్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కొత్త రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. పతకం సాధించి లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా కల" అని ఆమె చెప్పింది.

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో సౌదీ అరేబియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10 మంది అథ్లెట్లలో మషాల్ ఒకరు. ఆమెతో పాటు సౌదీ చరిత్రలో 16 ఏళ్ల వయస్సులో అర్హత సాధించిన అతి పిన్న వయస్కురాలు జైద్ అల్-సర్రాజ్.తన కెరీర్‌లో మొదటిసారిగా 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో పోటీ పదుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com