కువైట్ బయోమెట్రిక్.. 28.5% మంది ప్రవాసులు దూరం
- August 01, 2024
కువైట్: బయోమెట్రిక్ వేలిముద్రలను ప్రారంభించినప్పటి నుండి దాదాపు 2.5 మిలియన్ల మంది పౌరులు, నివాసితులు పూర్తి చేశారని క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఈద్ అల్-ఒవైహాన్ తెలిపారు. 2,487,932 మంది బయోమెట్రిక్ వేలిముద్రను పూర్తి చేసినట్టు వెల్లడించారు. సుమారు 22% మంది కువైటీలు ఇంకా బయోమెట్రిక్ తీసుకోలేదని, 28.5% మంది ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ స్కాన్ చేయించుకోలేదన్నారు. పౌరులు మరియు నివాసితులు తమ బయోమెట్రిక్ స్కాన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు, ప్రాజెక్ట్ విజయవంతానికి దారితీసినందుకు అల్-అవైహాన్ ప్రశంసించారు.
కువైట్‌లకు సెప్టెంబర్ 30 వరకు, ప్రవాసులకు డిసెంబర్ 30 వరకు గడువు పొడిగించినందున, పౌరులు మరియు నివాసితులు బయోమెట్రిక్ పూర్తి చేయడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ తగిన సమయాన్ని ఇస్తోంది. ఈ తేదీ తర్వాత బయోమెట్రిక్ వేలిముద్ర వేయని ప్రతి పౌరుడు లేదా నివాసి లావాదేవీలు నిలిపివేయబడతాయని అల్-అవైహాన్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







