స్విట్జర్లాండ్‌కు భారతీయ బృందం...
- June 15, 2016
స్విట్జర్లాండ్‌లో నల్లధనం దాచుకున్న కుబేరుల వివరాలను తెలుసుకునేందుకు భారతీయ బృందం త్వరలో ఆ దేశంలో పర్యటించనుంది. అక్కడి బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచుకున్న సొమ్ము వివరాలను ఆ బృందం బయటపెట్టనుంది. ఇటీవల స్విజ్ దేశాధ్యక్షుడు జోహన్న స్నీడర్ అమ్మాన్తో ప్రధాని మోదీ భేటీ అయిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2018 సంవత్సరం నుంచి నల్ల కుబేరుల వివరాలపై ఇరు దేశాలు సమాచారాన్ని పంచుకునేందుకు ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోనున్నారు. బుధవారం నాడు స్విట్జర్లాండ్‌కు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు భారతీయ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. బహుళ పన్ను విధానం, ఆర్థిక అంశాలపై ఆ బృందం చర్చలు నిర్వహించింది.రెవన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్లతో స్విజ్ అధికారులు జాక్వస్ డీ వాటెల్లీలు సమావేశం అయ్యారు. ఈ ఏడాది చివరి లోగా ఇరు దేశాల మధ్య సమాచార పంపకంపై ఒప్పందం కుదిరే అవకాశాలున్నట్లు వాళ్లు తెలిపారు. ఒకసారి ఆ ఒప్పందం కుదిరితే, 2018 తర్వాత స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల అకౌంట్ల వివరాలు ఆటోమెటిక్‌గా తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరోసారి రెండు దేశాల అధికారులు నల్లధనం అంశంపై భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







