హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం..
- August 02, 2024
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా 16 మంది మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సొన్ ప్రయాగ గౌరీ కుండ్ మధ్య కేదార్ నాథ్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. కేదార్నాథ్ లోయ మార్గం తెగిపోవడంతో చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడింది. ట్రెకా మార్గంలో భీంభాలి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ లోయ మార్గం తెగిపోయింది. ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన 425 మంది యాత్రికులను వాయుసేన రక్షించింది. లించోలి వద్ద చిక్కుకుపోయిన యాత్రికులను రక్షించడానికి చినూక్, MI-17 హెలికాప్టర్లును రంగంలోకిదింపి కాపాడారు.
కేదార్నాథ్ ట్రెక్ మార్గం 16 కిలోమీటర్లు దెబ్బతింది. గౌరీకుండ్, ఘోడా పడవ్, లించోలి, బడి లించోలి, భీంబాలి వద్ద రహదారి దెబ్బతింది. రాంబర సమీపంలో రెండు వంతెనలు కొట్టుకొని పోయాయి. లోయ మొత్తం తెగిపోవడంతో, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందం అప్రమత్తమైంది. సోన్‌ప్రయాగ్ భీంబాలి మధ్య చిక్కుకుపోయిన 1,100 మంది యాత్రికులను ప్రత్యామ్నాయ మార్గంలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. వర్షాల కారణంగా రూర్కీలోని డేరా బస్తీలో ఇల్లు కూలి నలుగురు మృతి చెందగా.. రూర్కీలో జరిగిన మరో ఘటనలో విద్యుదాఘాతానికి గురై ఓ మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉత్తరాఖండ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందగా.. 50 మంది గల్లంతయ్యారు. పలు ప్రాంతాల్లో ఇల్లు ధ్వసం కాగా.. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో SDRF సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కులులోని సైన్జ, మలాన మండి జిల్లాలో పాధర్, సిమ్లా జిల్లాలో రాంపూర్ లో వరదలు సంభవించాయి. సిమ్లా జిల్లాలో సమేజ్ గ్రామంలో 33 మంది గల్లంతయ్యారు. కొండ చరియలు విరిగిపడటంతో మనాలి చండిఘడ్, మనాలి లెహ్ జాతీయ రహదారి దెబ్బతింది. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుతో హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి కావలసిన సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ రాంపూర్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ప్రతికూల వాతావరణంతో సహాయచర్యలకు విఘాతం కలుగుతుంది. శుక్రవారం కూడా భారీ వర్షసూచన కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







