మహేశ్ బ్యాంక్ లో భారీ మోసాలు
- August 02, 2024
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. రెండు రోజుల పాటు సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు రూ. కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో రూ.300 కోట్ల కుంభకోణంపై ఈడీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. మహేష్ బ్యాంక్ లో రెండేళ్ల వ్యవధిలో మహేష్ బ్యాంక్లో 1800 మందికి డమ్మీ గోల్డ్ రూ. 300 కోట్లు డమ్మీ గోల్డ్ ను ఇచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు తేలింది. రుణాల పేరిట బ్యాంకు నిధులు పక్కదారి పట్టినట్టు ఈడీ అనుమానిస్తోంది. రెండు రోజులపాటు బ్యాంక్ ప్రమోటర్ల వారి సన్నిహితుల ఇళ్ళల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో కోటి రూపాయల నగదు, 5 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు, డిజిటల్ ఆధారాలతో పాటు కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మహేష్ బ్యాంక్ లో రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. వీరందరూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, మరో రూ.18.50 కోట్ల నిధులకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. బ్యాంక్ లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని, తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేసినట్లు కీలక ఆధారాలు సేకరించారు. రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు చెందిన పలు ఆస్తులకు భారీ ఎత్తున లోన్స్ ఇచ్చారని, బ్యాంక్ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు. మహేశ్ బ్యాంక్ లో 1800 మందికి నకిలీ బంగారంపై రూ. 300 కోట్ల రుణాలు ఇచ్చిన వైనంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







