Dh75,000 వార్షిక అద్దె మద్దతును ప్రకటించిన అబుదాబి

- August 06, 2024 , by Maagulf
Dh75,000 వార్షిక అద్దె మద్దతును ప్రకటించిన అబుదాబి

అబుదాబి: ఎమిరాటీ కుటుంబాలు ఇప్పుడు వార్షిక ఆర్థిక సహాయం, పాక్షిక రుణ మినహాయింపు మరియు లోన్ రీపేమెంట్ వ్యవధిని పొడిగించడం ద్వారా హౌసింగ్ కోసం మద్దతును పొందవచ్చని అబుదాబి హౌసింగ్ అథారిటీ (ADHA) ప్రకటించింది. ఎమిరాటీ ఫ్యామిలీ గ్రోత్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద, మెడీమ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అర్హులైన పౌరులకు గృహనిర్మాణ కార్యక్రమాలు అందించబడతాయని, సెప్టెంబర్ 2024 నుండి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.

1. నూతన వధూవరులకు అద్దె సహాయం

కొత్తగా పెళ్లయిన ఎమిరాటీలు ఈ చొరవ కింద రెండేళ్లపాటు సంవత్సరానికి Dh75,000 పొందవచ్చు. గరిష్టంగా నాలుగు సంవత్సరాల వరకు రెన్యూవల్ చేసుకోవచ్చు. అద్దె సహాయాన్ని పొందేందుకు, పౌరులు తప్పనిసరిగా నెలవారీ ఆదాయం Dh50,000 కంటే తక్కువగా ఉండాలి.  లీజుకు తీసుకున్న యూనిట్ తప్పనిసరిగా అల్ ఐన్ మరియు అల్ దఫ్రా రీజియన్‌తో సహా అబుదాబిలో ఉండాలి. 2. పాక్షిక రుణ మినహాయింపు

నాల్గవ, ఐదవ లేదా ఆరవ బిడ్డను కలిగి ఉన్న యూఏఈ జాతీయులు ADHA ద్వారా ఆమోదించబడిన హౌసింగ్ లోన్ అభ్యర్థనపై పాక్షిక మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తగ్గింపులు నాల్గవ బిడ్డకు Dh30,000, ఐదవ బిడ్డకు Dh30,000 మరియు ఆరవ బిడ్డకు AED40,000 అందజేస్తారు. గృహ నిర్మాణం, ఇంటి కొనుగోలు మరియు ఇంటి కూల్చివేత, పునర్నిర్మాణం కోసం రుణాలపై పాక్షిక మినహాయింపు వర్తిస్తుంది. Dh21,000 నుండి Dh50,000 వరకు నెలవారీ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులు పాక్షిక మినహాయింపును పొందవచ్చు.

3. తిరిగి చెల్లించే వ్యవధి పొడిగింపు

నలుగురు నుండి ఆరుగురు పిల్లలను కలిగి ఉన్న పౌరులు ఆమోదించబడిన గృహ రుణం  తిరిగి చెల్లింపును పొడిగించుకోవచ్చు. ఇది చెల్లించాల్సిన నెలవారీ వాయిదాను తగ్గిస్తుంది. నవజాత నాల్గవ, ఐదవ లేదా ఆరవ బిడ్డ ఉన్న కుటుంబాలకు, ప్రతి అదనపు బిడ్డకు తిరిగి చెల్లించే వ్యవధిని అదనంగా మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇది గృహ నిర్మాణ రుణాలు, గృహ కొనుగోలు రుణాలు మరియు ఇల్లు కూల్చివేత, పునర్నిర్మాణ రుణాలకు వర్తిస్తుంది. అర్హత గల దరఖాస్తుదారులు తప్పనిసరిగా AED50,000 కంటే ఎక్కువ నెలవారీ ఆదాయం కలిగి ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com