వాముతో కొలెస్ట్రాల్ కరిగించేసుకోండిలా.!

- August 07, 2024 , by Maagulf
వాముతో కొలెస్ట్రాల్ కరిగించేసుకోండిలా.!

వామును పిండి వంటల్లో వాడుతుంటారు. అలాగే కొందరు డైలీ వంటకాల్లోనూ వివిధ రకాలుగా వాడుతుంటారు. ఎలా వాడినా వాడకం అయితే ముఖ్యం. వాడిన వాళ్లకి ఖచ్చితంగా ఆరోగ్య ప్రయోజనాలుంటాయ్.
అయితే వాముని సరైన పద్ధతిలో వాడితే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి ఊబకాయం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని తాజా సర్వేలో తేలింది.
వాములో రిచ్ విటమిన్స్, మినరల్స్ వుంటాయ్. నియాసిన్, థయామిన్, సోడియం, పాస్ఫరస్, కాల్షియం పుష్కలంగా వుంటాయ్. వీటితో పాటూ కార్భోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్ కూడా ఎక్కువే.
అంతేకాదు, వాములోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఆర్ధరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయ్. నొప్పి వున్న చోట వాముతో కట్టు కడితే ఆ నొప్పి నుంచి తేలిగ్గా ఉపశమనం కలుగుతుంది.
అయితే వాముని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొన్ని వాము గింజల్ని తీసుకుని క్రష్ చేసి, ఇందులో కొంచెం బెల్లం కలిపి వాటిని మెల్లగా నములుతూ వుండాలి. ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు చేస్తే కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయ్.
అలాగే, జలుబు తదితర శ్వాస సంబంధిత సమస్యలకు సైతం ఇలాగే చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలున్నా తగ్గిపోతాయ్. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. వాముని, జీలకర్ర, అల్లంతో కలిపి మరిగించి ఆ నీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com