రెజ్లింగ్‌కు గుడ్ బై అంటూ వినేశ్ ఫొగట్ ట్వీట్..
- August 08, 2024
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పింది. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ ఫైనల్ ముందు అధిక బరువుతో అనర్హత వేటుకి గురికావడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది ఆమె. తన రిటైర్మెంట్ పై ఎక్స్ లో వినేశ్ ఫొగట్ పోస్టు చేసింది.
‘నాపై రెజ్లింగ్.. మ్యాచ్ గెలిచింది. నేను ఓడిపోయాను.. నా ధైర్యాన్ని కోల్పోయాను. నాకు ఇక శక్తిలేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024..’ అని ఆమె చెప్పింది. అందరికీ తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, తనను క్షమించాలని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఫొగట్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై తీర్పును వెలువడించాల్సి ఉంది. పతకానికి అడుగు దూరంలో వినేశ్ ఫొగట్‌కు ఎదురుదెబ్బ తగలడంతో భారతీయులు నిరాశ చెందారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!