సమంత ‘సిటాడెల్’ త్వరలోనే.! ప్రూఫ్ ఇదిగో.!

- August 08, 2024 , by Maagulf
సమంత ‘సిటాడెల్’ త్వరలోనే.! ప్రూఫ్ ఇదిగో.!

సీనియర్ బ్యూటీ సమంత ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత ‘సిటాడెల్’ అనే ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రియాంకా చోప్రా నటించగా, తెలుగు వెర్షన్ సమంత నటించింది.

అయితే, ప్రియాంకా చోప్రా నటించిన ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్‌లో ఎప్పుడో టెలికాస్ట్ అయిపోయింది. అంతంత మాత్రంగానే ఆదరణ దక్కించుకుంది.

సమంత ‘సిటాడెల్’ సంగతేంటో.! అని పలు కథనాలొచ్చాయ్ కానీ, రెస్పాన్స్ లేదింతవరకూ. దాంతో ఈ సిరీస్ అటకెక్కేసినట్లే అనుకున్నారంతా. కట్ చేస్తే, సిటాడెల్ - హనీ బన్నీ టైటిల్‌తో టీజర్ వదిలారు సడెన్‌గా. దాంతో, ఈ సిరీస్ ఈ సిరీస్ వుందన్న సంగతి కన్‌ఫామ్ అయ్యింది.

అంతేకాదు, నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సమంత ‘సిటాడెల్ - హనీ బన్నీ’ స్ర్టీమింగ్ కానుంది. ఇక, టీజర్ విషయానికి వస్తే, యాక్షన్ కట్‌లో చూపించారు. ఆల్రెడీ ప్రియాంకా చోప్రా సిటాడెల్ చూస్తే అందులో యాక్షన్‌తో పాటూ భీభత్సమైన ఇంటిమేట్ సన్నివేశాలు కూడా వుంటాయ్.

మరి, సమంత సంగతేంటో కానీ, ఈ సిరీస్‌లో సమంతతో పాటూ, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ పోషించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com