భారత దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం ప్రారంభం..

- August 09, 2024 , by Maagulf
భారత దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం ప్రారంభం..

న్యూ ఢిల్లీ: ఏటీఎం నుంచి నగదు తీసుకోవటం మీరు చూసిఉంటారు. కానీ, ఇప్పుడు ఏటీఎం నుంచి బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభమైంది. ఒడిశాలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం మిషన్ నుంచి బియ్యాన్ని తీసుకోవచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్ లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను ప్రారంభించింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ ను బియ్యం ఏటీఎం స్కీరన్ పై నమోదు చేయాలి. ఆ తరువాత వేలిముంద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతీ రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు.

ఈ విధానం ద్వారా బియ్యంకోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా భువనేశ్వర్ లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు. ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ విజయవంతం అయితే.. రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించనుంది.

ఒడిశా ప్రబుత్వం 2021 సంవత్సరంలోనే ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ)తో అనేక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేసింది. పంపిణీ వ్యవస్థ, వరి సేకరణ, బియ్యం ఏటీంఎం, స్మార్ట్ మొబైల్ స్టోరేజ్ యూనిట్ వంటి కొన్ని ప్రాజెక్టులు వీటి కింద ప్రారంభించనున్నారు. ఈ బియ్యం ఏటీఎంను గురువారం ఒడిశా పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం అని చెప్పారు. ఇది విజయవంతమైతే రానున్న రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com