ఆగస్టు 15 నుంచి పాఠశాల్లో కొత్త రూల్..
- August 09, 2024
హరియాణా: ఇక నుంచి విద్యార్థులు.. టీచర్లకు, తోటీ స్నేహితులకు పలకరింపుగా గుడ్ మార్నింగ్ అని చెప్పకూడదు. జై హింద్ అని చెప్పాలి. ఈ విధానం ఆగస్టు 15 నుంచి అన్నిప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తప్పక పాఠించాల్సి ఉంటుంది. అయితే.. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. హరియాణా రాష్ట్రంలో. ఈ మేరకు అక్కడి పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఓ సర్య్కూలర్ జారీ చేసింది.
అన్ని విద్యాసంస్థలకు, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో దేశ భక్తి, గౌరవం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేసే ముందు నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేశారు. జైహింద్ నినాదంతో ప్రజలను ఒక్కటి చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో నాయకులు ఒకరికి ఒకరు జైహింద్ అని చెప్పుకుంటూ పలకరించుకునేవారు.
స్వాత్రంత్య అనంతరం దేశ సాయుధ దళాలు ఈ నినాదాన్ని గ్రీటింగ్‌గా స్వీకరించాయి. దేశ సార్వభౌమాధికారం, భద్రత పట్ల వారి నిరంతర నిబద్ధతను ఇది ప్రతీక.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!