అమెజాన్, గూగుల్ ప్రతినిధులతో నేడు రేవంత్ భేటి
- August 09, 2024
అమెరికా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు.
రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రాయితీలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ గూగుల్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత సీఎం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని బయో డిజైన్ సెంటర్‌కి వెళతారు. యూనివర్సిటీలోని సస్టైనబిలిటీ డీన్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రాజ్ దత్‌తో వివిధ అంశాలపై చర్చిస్తారు. .అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ సమావేశం కానున్నారు.
గూగుల్ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెజాన్ గ్లోబల్ డేటా సెంటర్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్‌తో సమావేశం కానుంది. ఆ తర్వాత Z స్కాలర్ జై చౌదరిని, కంపెనీ వ్యవస్థాపకుడుని కలుస్తారు. ఎనోవిక్స్, ఫిషర్ సైంటిఫిక్, మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులతో కూడా. సమావేశం కాను lన్నారు. ప్రొఫెసర్ సాల్మన్ స్మార్ట్ విలేజ్ మూమెంట్స్‌లో డార్విన్‌ను కలుసుకున్నాడు. అనంతరం ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







