నేటి నుంచి ‘హర్ ఘర్ తిరంగా’
- August 09, 2024
న్యూ ఢిల్లీ: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పండగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి ఆ చిత్రాన్ని https://harghartiranga.com/వెబ్సైట్లో పోస్ట్ చేయాలని సూచించారు.
‘హర్ఘర్తిరంగా’ను గుర్తుండిపోయే ఈవెంట్గా మార్చుకుందామని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అందరూ త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ పెట్టారు.
‘ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో హర్ఘర్తిరంగాని మరపురాని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేసి ఈ ఉద్యమంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నాను. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను https://harghartiranga.com/లో షేర్ చేయండి’ అంటూ మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!