గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్

- August 11, 2024 , by Maagulf
గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్

దోహా: గాజా నగరానికి తూర్పున ఉన్న నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించింది.  రక్షణ లేని పౌరులపై భయంకరమైన ఊచకోత అని, క్రూరమైన నేరంగా అభివర్ణించింది. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రాథమిక సూత్రాలు, UN భద్రతా మండలి తీర్మానం 2601కు ఇది విరుద్ధం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణ పై దర్యాప్తు చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. 

తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న 1967 సరిహద్దుల్లో తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన హక్కులు, పాలస్తీనా కారణానికి న్యాయం చేయడంపై ఖతార్ రాష్ట్రం తన దృఢమైన వైఖరిని మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com