షార్జాలోని ఉద్యోగుల జీవితాన్ని మార్చేసిన 3-రోజుల వీకెండ్..!

- August 11, 2024 , by Maagulf
షార్జాలోని ఉద్యోగుల జీవితాన్ని మార్చేసిన 3-రోజుల వీకెండ్..!

యూఏఈ: రెండు సంవత్సరాల క్రితం షార్జా ప్రభుత్వ కార్యాలయాల్లో మూడు రోజుల వీకెండ్ అమలు చేసినప్పుడు, ఉద్యోగులు మరియు సిబ్బంది పని గంటలు తగ్గించడం వల్ల కుటుంబ బంధాలు, వారి సామాజిక సంబంధాల్లో మెరుగుదల నమోదు అయినట్లు  నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వేసవిలో ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాలకు తాత్కాలికంగా తగ్గిన పని వారాన్ని దుబాయ్ ప్రకటించిన తర్వాత - 14 సంవత్సరాలుగా షార్జా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 38 ఏళ్ల మరియం ఇబ్రహీం మాట్లాడుతూ.. దుబాయ్‌లో అమలు చేయబడే శుక్రవారం సెలవుదినం నా స్వంత జీవితంలో నేను అనుభవించిన వ్యక్తిగత ప్రయోజనాల ఆధారంగా సిబ్బందిని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

షార్జా ప్రభుత్వంలో నాలుగు రోజులు పనిచేయడం వల్ల తన పని నాణ్యత మెరుగుపడిందని,  పిల్లలతో గడపడానికి తనకు ఎక్కువ సమయం దొరికిందన్నారు. నాలుగు రోజుల పని వారం తన వార్షిక సెలవుల నుండి సెలవులు తీసుకునే భారాన్ని తగ్గించిందని కూడా ఆమె చెప్పారు. 

షార్జా మున్సిపాలిటీ నుండి ఇటీవల పదవీ విరమణ చేసిన 50 ఏళ్ల మహమ్మద్ అలీ అల్ ఎస్సా తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా పంచుకున్నారు.  ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చినందుకు షార్జా ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తగ్గిన పని గంటలు ప్రవేశపెట్టిన ఒక సంవత్సరం తర్వాత, జనవరి 2023లో విడుదల చేసిన అధికారిక నివేదికలో సిబ్బంది హాజరు రేటులో 74 శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నాయి. అనారోగ్య సెలవు రేట్లు 46 శాతం తగ్గాయని.. అధికారిక పని గంటల వెలుపల ఇ-గవర్నమెంట్ సేవలను అందించే రేటులో కూడా 61 శాతం పెరుగుదల నమోదుటిపాటు ఉద్యోగ పనితీరులో 90 శాతం మెరుగుదల ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసిన తర్వాత 91 శాతం మంది ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా, దాదాపు 87 శాతం మంది ఈ చర్య తమ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.  దాదాపు 85 శాతం మంది ఈ వ్యవస్థ పని మరియు కుటుంబ జీవితం మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడిందని చెప్పారు.

దుబాయ్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ (DGHR) 'అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్'ని ప్రకటించింది. ఈ కార్యక్రమం శుక్రవారాల్లో దుబాయ్‌లోని 15 ప్రభుత్వ సంస్థలలో ఆగస్ట్ 12 నుండి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేయబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com