షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారం స్మగ్గ్లింగ్
- August 11, 2024
హైదరాబాద్: విదేశాల్లో చవకగా దొరికే బంగారాన్ని వివిధ మార్గాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు నానాపాట్లు పడుతున్నారు. తాజాగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ ఫోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు. అయితే అతగాడి నడక, వ్యవహారంలో ఏదో తేడా కొట్టింది. ఇదే విషయం పసిగట్టిన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా అసలు బండారం బయటపడింది. ఈ సంఘటన హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్టు చేసింది. EK-528 విమానంలో అంతర్జాతీయ అరైవల్ హాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సదరు ప్రయాణికుడి బూట్లు, వీపుకు తగిలించుకునే సామాన్ల బ్యాగ్‌ను అధికారులు స్కాన్ చేయగా దాదాపు కిలోన్నర బంగారం బయటపడింది.
బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు పసుపు రంగు పెద్ద మెటల్ బార్‌లు నిందితుడి ఎడమ కాలి షూలో, బ్యాక్ ప్యాంక్ బ్యాగ్‌లో దాచాడు. అలాగే పసుపు రంగులో ఉన్న ఓ మెటల్ గొలుసును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1390.850 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,06 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!