ఆలూ ఎగ్ కోఫ్తా
- June 16, 2016
కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు - 4, ఆలూ - 50 గ్రా., ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట, బ్రెడ్‌పొడి - 100 గ్రా., మొక్కజొన్నపిండి - 50 గ్రా., జీరాపొడి - అర టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందుగా కూరగాయల్ని సన్నగా తరుక్కోవాలి. ఆలూని ఉడికించి మెదపాలి. మొక్కజొన్న పిండిని నీళ్లతో చిక్కగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆలూలో తరిగిన కూరగాయలు, మసాలా పొడులు వేసి బాగా కలపి ఈ మిశ్రమాన్ని గుడ్డు చుట్టూ అతికించాలి. వాటిని మొక్కజొన్న పిండిలో ముంచి తీసి, బ్రెడ్‌పొడిలో పొర్లించాలి. వీటిని నూనెలో దోరగా వేగించుకుని టమాటా సాస్తోగాని, పుదీనా చట్నీతో గాని తింటే బాగుంటాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







