మోచేతులు మెరవడానికి చిట్కాలు ..
- June 16, 2016
ముఖం, మెడ గురించి అందరూ శ్రద్ధ పెడతారు. కానీ మోచేతుల గురించి మాత్రం చాలామంది పట్టించుకోరు. అవి నల్లగా ఉంటే పొట్టి చేతుల దుస్తులు ధరించినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఆ నలుపు తగ్గించుకునేలా చూసుకోండి. అదెలాగంటే..
చక్కెర: మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చర్మం నల్లగా, బరగ్గా మారుతుంది. ఆ సమస్య నుంచి బయట పడాలంటే చెంచా తేనెలో చక్కెర, కాస్త నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి, నలుపుదనం కూడా తగ్గుతుంది.
నిమ్మకాయ: నిమ్మరసంలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. నిమ్మకాయను సగానికి కోసి చక్కెరలో అద్ది మోచేతులపై రుద్దాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగి తేనెతో సున్నితంగా మర్దన చేయాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందించి నలుపు తగ్గిస్తుంది.
బంగాళాదుంప: ఇందులోనూ బ్లీచింగ్ గుణాలుంటాయి. రెండు బంగాళాదుంపల్ని గుజ్జుగా చేసి అందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు పూతలా రాయాలి. కాసేపయ్యాక మర్దన చేసి కడిగేస్తే చర్మం చక్కగా నిగారింపును సంతరించుకుంటుంది.
ఆలివ్‌నూనె: ఈ నూనెతో మర్దన చేయడం వల్ల బరగ్గా మారిన చర్మం మృదువుగా మారుతుంది. నలుపుదనం కూడా తగ్గుతుంది. ఆలివ్ నూనెను కాస్త వేడి చేసి అందులో బాదం, కొబ్బరినూనెను కొద్దికొద్దిగా కలిపి నల్లగా ఉన్న చోట రాయాలి. ప్రతిరోజూ రాత్రిపూట ఇలా చేయడం వల్ల క్రమంగా చర్మం రంగుమారి మృదువుగా తయారవుతుంది.
చందనం: చర్మ రంగును మార్చి.. చక్కటి నిగారింపును సొంతం చేసుకోవడానికి చందనం దోహదం చేస్తుంది. రెండుచెంచాల గంధంలో కొద్దిగా తేనె కలిపి మోచేతులకు రాయాలి. ఇది మృతకణాలను తొలగిస్తుంది. తేనె తేమనందించి మృదువుగా మారుస్తుంది.
పెరుగు: సెనగపిండీ, పెరుగూ సమపాళ్లలో తీసుకుని పూతలా వేసుకోవాలి. పొడిగా అయ్యాక కాసిని నీళ్లు చల్లి మర్దన చేసుకుని కడిగేయాలి. సెనగపిండి నలుపును తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







