నిహారికకు కంగ్రాట్స్ తెలిపిన మహేష్.!

- August 12, 2024 , by Maagulf
నిహారికకు కంగ్రాట్స్ తెలిపిన మహేష్.!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కొన్ని కొన్ని సినిమాలకు తన సొంత రివ్యూస్ ఇస్తుండడం ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.
పలు సూపర్ హిట్ చిత్రాలే కాదు, యావరేజ్, బిలో యావరేజ్ సినిమాలకు సైతం మహేష్ బాబు తన రివ్యూలిస్తుండడం చూశాం.
తాజాగా ఆయన ఓ చిన్న సినిమా గురించి ప్రస్థావించారు. అదే ‘కమిటీ కుర్రోళ్లు’. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయ్.
కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయ్. వీకెండ్ సందర్భంగగా ఆదివారం ఈ సినిమాకి హౌస్ ఫుల్ షోస్ పడ్డాయని సమాచారం.
ఇక, తాజాగా మహేష్ బాబు ఈ సినిమా యూనిట్‌కి ముఖ్యంగా నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న నిహారికకు కంగ్రాట్స్ తెలిపారు.
సినిమా చూసి వుంటే, రివ్యూ ఇచ్చేవారే. కానీ, ఇంకా చూడలేదనీ, త్వరలోనే సినిమాని ఖచ్చితంగా చూస్తాననీ మహేష్ బాబు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com