న్యూజెర్సీలో సేవలు ముమ్మరం చేసే దిశగా NATS అడుగులు
- August 13, 2024
అమెరికా: ఆగస్ట్12: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగువారు అధికంగా ఉండే న్యూజెర్సీ తన సేవలను మరింత ముమ్మరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా నాట్స్ న్యూజెర్సీ నూతన కార్యవర్గాన్ని నియమించుకుంది. ముఫై మంది సభ్యులతో కూడిన న్యూజెర్సీ నాట్స్ నూతన కార్యవర్గం భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించింది. న్యూజెర్సీ నాట్స్ నూతన కార్యవర్గ సమన్వయకర్త మోహన్ కుమార్ వెనిగళ్ల, సంయుక్త సమన్వయకర్తగా ప్రసాద్ రావు టేకి న్యూజెర్సీ నాట్స్ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, వివిధ అంశాల వారీగా సంఘాలు ఏర్పాటు చేసి న్యూజెర్పీలో నాట్స్ సేవలను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఈ సమావేశంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ న్యూజెర్సీ నాట్స్ నాయకులకు దిశా నిర్థేశం చేశారు.2009లో ప్రారంభమైన నాట్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికాలో తెలుగువారి ఆత్మబంధువులా మారిందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. న్యూజెర్సీలో నాట్స్ సేవలను పెంచేందుకు నాట్స్ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు. నాట్స్ న్యూజెర్సీలో సేవ కార్యక్రమాలు తెలుగు వారందరికి చేరువైందని నాట్స్ మాజీ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ అన్నారు. నాట్స్ ఉన్నతిలో నాట్స్ వాలంటీర్లు పోషించిన పాత్ర మరువలేనిదని తెలిపారు. నాట్స్ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి నాట్స్ నాయకత్వం గుర్తింపు ఇస్తుందని నాట్స్ న్యూజెర్సీ సమన్వయకర్త మోహన్ కుమార్ వెనిగళ్ల అన్నారు. అందరి సహకారంతో న్యూజెర్సీలో నాట్స్ సేవలు, కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు టీపీ రావు( శ్రీనివాసరావు తుమ్మలపెంట), బిందు యలమంచిలి, నాట్స్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు భీమినేని, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ( మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, వంశీ కృష్ణ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, సురేష్ బొల్లు, బస్వశేఖర్ శంషాబాద్, రాజేష్ బేతపూడి, విష్ణు ఆలూరు తదితరులు పాల్గొని తమ అనుభవాలు తెలియచేస్తూ, నూతన కార్యవర్గానికి సూచనలు, సలహాలు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూ జెర్సీ నాట్స్ నూతన కార్యవర్గానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
న్యూజెర్సీ నాట్స్ చాప్టర్ టీమ్ ఇదే..!
మోహన్ కుమార్ వెనిగళ్ళ, సమన్వయకర్త
ప్రసాద్ రావు టేకి, సంయుక్త సమన్వయకర్త
వెంకటేష్ కోడూరి, ప్రకాష్ కపిల, రమేష్ నెల్లూరి, మోహన్ బాబు తాళ్లూరి, వెంకట్ గోనుగుంట్ల, రవి తూబాటి, త్రినాథ్ కొండ్ర, శ్రీనివాస్ నీలం, గాయత్రి చిట్లేటి, శ్రీనివాస్ కొల్లా, సుకేశ్ సబ్బాని, ప్రశాంత్ కుచ్చు, శంకర్ జెర్రిపోతుల, ప్రసూన మద్దాలి, స్వర్ణ గడియారం, కార్తీక్ దోనేపూడి, ప్రణీత పగిడిమర్రి, ప్రవీణ్ చక్కిలం, శ్రీమాన్ పి, రాకేష్ వేలూరు, విజయ్ కుమార్ సొప్ప, రాజేష్ పెద్దిరాజు, బినీత్ పెరుమాళ్ళ, శ్రీధర్ దోనేపూడి, సురేందర్ పోలేపల్లి, శ్రీనాథ్ వడ్డే, క్రాంతి యడ్లపూడి, పవన్ గోపా, గణేష్ ధనికుల, కిరణ్ దాడి.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు