ప్రవాసులకు అత్యుత్తమ దేశాల్లో ఒమన్..!

- August 14, 2024 , by Maagulf
ప్రవాసులకు అత్యుత్తమ దేశాల్లో ఒమన్..!

మస్కట్: ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ 2024 సర్వే ప్రకారం.. ప్రవాసులకు ఉత్తమమైన దేశాలలో ఒమన్ ఒకటి. స్నేహపూర్వకత, భద్రత మరియు సులభంగా స్థిరపడేందుకు అధిక స్కోర్‌లతో సర్వేలో సుల్తానేట్ మొత్తం 12వ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం 174 దేశాలు లేదా భూభాగాల్లోని 175 జాతీయతలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12,500 మంది ప్రవాసుల నుండి అభిప్రాయాలను  సేకరించారు. జీవన నాణ్యత, ఈజ్ ఆఫ్ సెటిల్లింగ్, విదేశాల్లో పని చేయడం, పర్సనల్ ఫైనాన్స్ మరియు ఎక్స్‌పాట్ ఎసెన్షియల్స్ ఇండెక్స్ వంటి అంశాలను విశ్లేషించడం ద్వారా ఈ సర్వే ఉత్తమ దేశాలకు ర్యాంక్ ఇచ్చింది. 2024లో 53 దేశాలకు ర్యాంక్ ఇచ్చారు. పనామా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మెక్సికో, ఇండోనేషియా, స్పెయిన్ మరియు కొలంబియా మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. కువైట్ చివరి స్థానంలో ఉంది. టర్కీ, ఫిన్లాండ్, జర్మనీ మరియు కెనడా అట్టడుగు ఐదు స్థానాల్లో నిలిచాయి.

ఒమన్‌లోని ప్రవాసులు స్థానికుల స్నేహపూర్వకత (ఎనిమిదవ ర్యాంక్), ఈజ్ ఆఫ్ సెటిల్లింగ్ (12వ ర్యాంక్), వ్యక్తిగత ఫైనాన్స్ (12వ ర్యాంక్)తో కూడా చాలా సంతృప్తి చెందారు.ఒమన్ కల్చర్ అండ్ వెల్‌కమ్ (12వ), సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (13వ), ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ (13వ) మరియు ఫ్యామిలీ ఫ్రెండ్స్ (14వ) విభాగాల్లో టాప్ 15లో ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్‌లో ఒమన్  సగటు 28వ స్థానంలో ఉంది. ఈ సర్వేలో పదో ర్యాంక్‌లో ఉన్న యూఏఈ ఈ ప్రాంతంలో అత్యధిక ర్యాంక్‌ని పొందిన దేశంగా ఉండగా, కువైట్ (53వ) వరుసగా ఏడోసారి చివరి స్థానంలో నిలిచింది. టర్కీయే 52వ స్థానంలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com