యూఏఈ గోల్డెన్ వీసా: Dh30,000 బేసిక్ జీతం తప్పనిసరా?
- August 15, 2024
యూఏఈ: గోల్డెన్ వీసాకు అర్హత పొందిన యూఏఈ ఆధారిత నిపుణులు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేయడానికి ప్రాథమికంగా నెలకు Dh30,000 జీతం కలిగి ఉండాలి. కనీస జీతం నుంచి అలవెన్స్‌లను మినహాయించినట్లు ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్పారు.
యూఏఈలో పరిహారం ప్యాకేజీలు సాధారణంగా ప్రాథమిక జీతాలు, గృహాలు, రవాణా వంటి అలవెన్స్ లు ఉంటాయని ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ దుబాయ్ ఆఫీస్ సీనియర్ మేనేజర్ నోఫిసాతు మోజిది తెలిపారు. గతంలో, 'సైంటిస్ట్స్ & స్పెషలిస్ట్స్' విభాగంలో దరఖాస్తుదారులకు అలవెన్స్‌లతో సహా నెలకు కనీస జీతం Dh30,000 తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. దుబాయ్ ఆధారిత అరేబియన్ బిజినెస్ సెంటర్‌లో ఆపరేషన్ మేనేజర్ ఫిరోసేఖాన్ మాట్లాడుతూ..30,000 దిర్హామ్ బేసిక్ జీతం ఉన్న దరఖాస్తుదారులు మాత్రమే దీర్ఘకాలిక వీసా పొందుతున్నారని చెప్పారు. కొత్త సవరణతో 'మేనేజర్', 'డైరెక్టర్' వంటి హోదాలు ఉన్నవారితో పాటు ఇంజనీర్లు, డాక్టర్ వంటి వృత్తులలో ఉన్నవారు రెసిడెన్సీని పొందడం సులభం అవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!