GASTAT నివేదిక..జూలైలో ద్రవ్యోల్బణం 1.5%

- August 16, 2024 , by Maagulf
GASTAT నివేదిక..జూలైలో ద్రవ్యోల్బణం 1.5%

రియాద్: జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం..సౌదీ అరేబియాలో ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన జూలైలో 1.5 శాతం వద్ద స్థిరంగా ఉంది. డిసెంబర్ 2023 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. గృహ అద్దెలు వార్షిక ప్రాతిపదికన గత నెలలో 11.1 శాతం పెరిగాయి. అపార్ట్మెంట్ అద్దెలలో ఇది 12 శాతం పెరుగగా..  జూన్‌లో ఇళ్ల ధరలు 10.1 శాతం పెరిగాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్ కూడా 0.4 శాతం పెరిగింది, కూరగాయల ధరలు 5.3 శాతం పెరిగాయి. రెస్టారెంట్లు మరియు హోటల్స్ విభాగం 2.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. హోటల్ సేవలు మరియు అమర్చిన అపార్ట్‌మెంట్ల ధరలలో 7.0 శాతం పెరుగుదల ప్రభావం చూపింది.  ఇంటర్మీడియట్ మరియు మాధ్యమిక విద్య ఫీజులలో 3.8 శాతం పెరుగుదల నమోదైంది. రవాణా విభాగంలో 4.8 శాతం తగ్గుదల కారణంగా 3.5 శాతం వాహనం కొనుగోలు ధరలు తగ్గాయని నివేదిక తెలిపింది. వినియోగదారు ధర సూచిక (CPI) లేదా ద్రవ్యోల్బణం 490 వస్తువులతో కూడిన స్థిరమైన వస్తువులు, సేవల కోసం వినియోగదారులు చెల్లించే ధరలలో మార్పులను ప్రతిబింబిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com