ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.!

- August 17, 2024 , by Maagulf
ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.!

నిద్ర సరిగా లేకపోతే రోజంతా బద్దకంగా అన్ ఈజీగా అనిపిస్తుంటుంది. ప్రశాంతమైన నిద్ర వుంటేనే రోజంతా యాక్టివ్‌గా తిరుగుతారు. మరి ప్రశాంతమైన నిద్ర కోసం ఏం చేయాలి.?
కొందరికి పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. మరికొందరు గంటల తరబడి తన్నుకున్నా నిద్ర పోలేరు. అందుకు అనేక కారణాలు. అనవసరమైన ఆందోళన, మానసిక ఒత్తిడి.. ఇలా అనేక కారణాలు.
వాటిని అధిగమించాలంటే ముఖ్యంగా నిద్రపోయే గది, వాతావరణం సక్రమంగా వుండాలి. గదిలో పడుకునే ముందు లైట్స్ అన్నీ తీసేసి చీకటిగా వుండేలా చూసుకోవాలి.
అప్పుడే నిద్రకు ఉపక్రమించే మెలోనిన్ హార్మోన్ ఉత్పత్తి బాగుంటుంది. ఈ హార్మోన్ సవ్యంగా ఉత్పత్తి అయితేనే సక్రమమైన నిద్ర వస్తుంది.
గదిలో వాతావరణం మరీ ఎక్కువ చల్లగా, మరీ ఎక్కువ వేడిగా వుండకుండా చూసుకోవాలి. అలాగే, పడుకునే ముందు ముఖ్యంగా మొబైల్ వాడకం తగ్గించాలి. ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ చేసేవారిలోనూ నిద్ర సరిగా వుండదు. ఆల్కహాల్ అలవాటున్న వారిలో తాగిన వెంటనే నిద్ర వస్తుంది. కానీ, మత్తు  వదలగానే మెలకువ వచ్చేస్తుంటుంది.
పడుకునే ముందు కాఫీ, టీలు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. హెర్బల్ టీ తీసుకోవడం వల్ల నిద్ర ప్రశాంతగా పడుతుంది. అలాగే పడుకునే ముందు ఓ ఆరటి పండు తిన్నా మంచి నిద్ర పడుతుంది. దిండు, పరుపు సౌకర్యంగా వుండడం కూడా ప్రశాంతమైన నిద్రకు కారణాలు.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com