శివనామ జపం చేస్తున్న సుధీర్ బాబు.!

- August 17, 2024 , by Maagulf
శివనామ జపం చేస్తున్న సుధీర్ బాబు.!

విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు వెరీ రీసెంట్‌‌గా ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ధియేటర్లలో అంతంత మాత్రమే అనిపించుకున్నప్పటికీ ఓటీటీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది.
ఆ సంగతి అటుంచితే, లేటెస్ట్‌గా కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు సుధీర్ బాబు. ఈ సినిమాకి ‘జటాధర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. తెలుగుతో పాటూ, హిందీలోనూ బైలింగ్వల్ మూవీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
కాగా, లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ గత సినిమా ‘హరోం హర’ వైబ్స్‌నే చూపిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సుధీర్ బాబు అభిమానులు.
అయితే, ‘జటాధర’ అనే సౌండింగ్ చాలా బాగుందంటున్నారు. పరమేశ్వరుడి శక్తివంతమైన రూపాల్లో జటాధర రూపం ఒకటి. తాజా పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో శివుడి ఆ జటాధర రూపం కనిపిస్తోంది. చేతిలో త్రిశూలం పట్టుకున్న సుధీర్ బాబు సైడ్ యాంగిల్ మరింత ఆసక్తికరంగా వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com