‘మిస్టర్ బచ్చన్’కి కత్తిరేశారు.!
- August 17, 2024
మాస్ రాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘మిస్టర్ బచ్చన్’. అకస్మాత్తుగా ఇండిపెండెన్స్ డే రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా.? అంటే మిశ్రమ స్పందన వినిపిస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్లు బాగా చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మెయిన్ అట్రాక్షన్ అయ్యింది. అయితే, ప్రమోషన్లలో వున్న హుషారు సినిమాలో లేదని తేల్చేశారు.
బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘రైడ్’కి రీమేక్ అయిన ఈ సినిమాని తెలుగు వెర్షన్ కోసం చాలానే మార్పులు చేసేశారు. దాంతో, సినిమా స్వరూపం పూర్తిగా మారిపోయింది. అలాగని కొత్తదనమేదైనా వుందా.? అంటే అదీ లేదు.
రొటీన్ రొట్ట కొట్టుడు యవ్వారమే అని ఆడియన్స్ పెదవి విరిచేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాకా రెండో రోజుకే కొంత మేర కటింగ్స్ వేసేశారు. ల్యాగ్ ఎక్కువయ్యిందన్న రీజన్రతో దాదాపు 13 నిముషాల సీన్లను సినిమాలోంచి లేపేశారట రెండు రోజుల ప్రదర్శన తర్వాత.
ఇక, మాస్ అండ్ గ్లామరస్ అప్పియరెన్స్ ఇష్టపడే వాళ్లు తప్పదంటే వీకెండ్ ఎంజాయ్రమెంట్ కోసం ‘మిస్టర్ బచ్చన్’ చూడాలనుకుంటారేమో.
అందుకు ప్రధాన కారణం మిక్కీ జె మేయర్ పాటలు.. అందుకనుగుణంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందాల ఆరబోతే ఈ సినిమాని కాపాడాలేమో.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్