ప్రబాస్ ఇంకోటి మొదలెట్టేశాడు.!

- August 17, 2024 , by Maagulf
ప్రబాస్ ఇంకోటి మొదలెట్టేశాడు.!

‘కల్కి’తో  ఇటీవల రికార్డులు కొల్లగొట్టిన ప్రబాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలకు పైగానే వున్నాయ్. ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘రాజా సాబ్’, ‘స్పిరిట్’ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు ఇంకా వుంది.
అయితే, వాటిలో ‘సీతారామం’ డైరెక్టర్ హను రాఘవపూడి కూడా వున్న సంగతి తెలిసిందే. తాజాగా హను రాఘవపూడి సినిమాని ప్రబాస్ స్టార్ట్ చేసేశాడు.
శనివారం లాంఛనంగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే పేరు కొన్నాళ్లుగా వినిపిస్తూ వస్తోంది. అదే పేరును ఫిక్స్ చేస్తూ సినిమాకి ముహూర్తం షాట్ కొట్టేశారు. దాంతో ప్రబాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరో వారం రోజుల్లో అనగా ఆగస్టు 24 నుంచే రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ చేసేయనున్నారట. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఓ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట హను రాఘవపూడి.
హీరోయిన్‌గా మొదట మృణాల్‌ని అనుకున్నారు. కానీ, కొత్త భామ పేరు ప్రకటించారు. ఆమె మరెవరో కాదు, ఇన్‌స్టా రీల్స్‌తో పాపులరైన నటి ఇమాన్వీ.  సినిమా లాంచింగ్‌‌లో ఇమాన్వీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com