శ్రీసిటీలో సీఎం చంద్రబాబు బిజిబిజీ…
- August 19, 2024
శ్రీసిటీ: ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీసిటీలో నేడు పర్యటించారు.పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. . ఇక్కడ మొత్తం 15 సంస్థల కార్యకలాపాలను ఆయన ప్రారంభించిన ఆయన మరో ఏడు సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు.
దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్, ఇజ్రాయిల్‌కు చెందిన నియోలింక్, జపాన్‌కు చెందిన నైడిక్, ఓజెఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారతదేశానికి చెందిన అడ్మైర్, ఆటోడేటా, బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈప్యాక్, ఇఎస్‌ఎస్‌కెఏవై, ఎవర్‌షైన్, జేజీఐ, త్రినాత్, జెన్‌లెనిన్ సంస్థల కార్యాకలాపాలకు చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు.. రూ. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని చంద్రబాబు ప్రకటివంచారు.
ఇక చైనాకు చెందిన ఎన్‌జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్, జపాన్‌కు చెందిన ఏజీ ఆండ్ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా జపాన్‌కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఇ, సింగపూర్‌లతో పాటు భారతదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటు పై ఒప్పందాలు చేసుకున్నారు. వాటి పెట్టుబడుల విలువ 1,213కోట్ల రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది.
అనంతరం శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు.. ఎపి పారిశ్రామిక విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎపి సిఎం.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







