చికాగో భారతీయ అంధ క్రికెటర్ల పర్యటనకు NATS మద్దతు
- August 19, 2024
అమెరికా: అమెరికాలో పర్యటిస్తున్న భారత అంధ క్రికెటర్లను అనూహ్య మద్దతు లభిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS)తో పాటు పలు తెలుగు, ఇతర భారతీయ స్వచ్చంధ సంస్థలు భారత అంధ క్రికెటర్లకు తమ హర్థిక, ఆర్ధిక మద్దతు అందిస్తున్నాయి. బెంగళూరు కి చెందిన సమర్ధనం ట్రస్ట్, క్యాబి ఆధ్వర్యంలో భారత అంధ క్రికెటర్లు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించటం, 2028 పారా ఒలింపిక్స్ లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిధ్యానికి ఆర్ధిక వనరులు చేకూర్చటం వీరి అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా చికాగో లో నాట్స్‌తో పాటు నాట్స్ సోదర సంస్థలు భారత అంధ క్రికెటర్లను తమ మద్దతు ప్రకటించడంతో పాటు వారి కోసం విందు,పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యులను మెంటార్ ధీరజ్ అంధుల క్రికెట్‌లో మూడు కేటగిరిలను, వాటి విభజనను నాట్స్ సభ్యులకు వివరించారు. ఈ మూడు గ్రూపుల ఆధారంగానే క్రికెట్ టౌర్నమెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంధుల క్రికెట్ జట్టులో తెలుగు మరియు గుజరాతీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం పట్ల నాట్స్ హర్షం వ్యక్తం చేసింది.
అంధత్వాన్ని అధిగమించి ఆటను జయించిన ఈ ఆటగాళ్ళని చూసి అందరం స్ఫూర్తి పొందాలని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. అంధ క్రికెటర్లకు నాట్స్ అండదండలు ఎల్లపుడూ ఉంటాయని, వారు ఆడే మ్యాచ్ లకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటితో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్.కె బాలినేని, శ్రీ హరీష్ జమ్ముల, ఇమ్మానుయేల్ నీల, చికాగో చాప్టర్ టీం నుండి వీర తక్కెళ్లపాటి, శ్రీనివాస్ ఎక్కుర్తి, చెన్నయ్య కంబాల, సిరి బచ్చు భారతి పుట్ట, గోపి ఉలవ, కిరణ్, ప్రదీప్, సతీష్ త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు