కోల్‌కతా వైద్యరాలి హత్యాచార ఘటన పై సౌరవ్ గంగూలీ వినూత్న రీతిలో నిరసన

- August 20, 2024 , by Maagulf
కోల్‌కతా వైద్యరాలి హత్యాచార ఘటన పై సౌరవ్ గంగూలీ వినూత్న రీతిలో నిరసన

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆగస్టు 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నేరస్థుడిని కఠినంగా శిక్షించాలని పెద్దెత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే, గత వారం రోజుల క్రితం ఓ కార్యక్రమంలో వైద్యురాలి హత్య ఘటనపై గంగూలీ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం అవసరం. అయితే, కేవలం ఒక్క ఘటనతో రాష్ట్రంపై మనం ఓ అభిప్రాయానికి రాకూడదు అని వ్యాఖ్యానించాడు. గంగూలీ స్పందనపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు గంగూలీ గత శనివారం స్పందించారు. గత వారం నేను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మరికొందరు వక్రీకరించారు. ఏదేమైనా జరిగిన ఘటన దారుణమైంది. ఈ ఘటనలో నేరస్థుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడే సాహజం చేయకూడదు. శిక్ష చాలా తీవ్రంగా ఉండాలని గంగూలీ అభిప్రాయ పడ్డారు. ఈ ఘటనపై గంగూలీ తాజాగా వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు. ట్విటర్ లో తన ప్రొఫైల్ ఫొటోను తొలగించి బ్లాక్ చేశాడు. అలాగే, అతను క్యాప్షన్ లో.. కొత్త ప్రొఫైల్ పిక్.. అని గంగూలీ రాశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com