రష్మిక మండన్నా డబుల్ ధమాకా.!

- August 20, 2024 , by Maagulf
రష్మిక మండన్నా డబుల్ ధమాకా.!

నేషనల్ క్రష్ రష్మిక మండన్నాకి డిశంబర్ ధమాకా మంత్ కానుందనే చెప్పాలి. ఎందుకంటే ఆ మంత్‌లో సెన్సేషనల్ మూవీ ‘పుష్ప 2’ రిలీజ్ కానుంది.

అదొక్కటేనా.? తాజాగా మరో అప్డేట్ వచ్చింది. అదే మంత్‌లో రష్మిక మండన్నా బాలీవుడ్ మూవీ ‘చావా’ కూడా రిలీజ్ అవుతున్నట్లు తాజా అనౌన్స్‌మెంట్ వచ్చింది అధికారికంగా.

ఇంతవరకూ డిశంబర్ 6 ‘పుష్ప 2’ రిలీజ్ వుండడంతో మరే ఇతర సినిమా ఆ డేట్‌లో రిలీజ్ అయ్యేందుకు సాహసం చేయలేదు. కానీ, సడెన్‌గా ‘చావా’ బాలీవుడ్ మూవీ లైన్‌లోకి వచ్చింది.

అసలే ‘పుష్ప 2’పై అంచనాలున్నాయ్. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి బాలీవుడ్ టార్గెట్ కూడా పక్కాగా వుంది. అలాంటిది ఈ సినిమాతో పోటీ అంటే నిజంగా గట్స్ వుండాలి.

మరి, ‘చావా’కి అంత గట్స్ ఎందుకంటే కథ, కథనం. ఛత్రపతి శివాజీ హిస్టరీ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌషల్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ హిస్టారికల్ మూవీతో 2పుష్ప 2’, కమర్షియల్ హంగులున్న ‘పుష్ప 2’తో ‘చావా’ పోటీ ఎలా వుండబోతోందో ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఏది ఏమైతేనేం, రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం హీరోయిన్ అయిన రష్మికకు అసలు సిసలు ధమాకా పండగలా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com