ఈ అందం ఇంతవరకూ టాలీవుడ్ దృష్టిలో పడలేదేం.!
- August 20, 2024
పేరు శార్వరీ వాఘ్. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. లేటెస్ట్‌గా ‘మహారాజ్’ సినిమాలో కనిపించింది. విజయ్ సేతుపతి సినిమా కాదు, బాలీవుడ్ ‘మహారాజ్’. ఈ సినిమాలో తనదైన పర్‌ఫామెన్స్‌తో అందంతో ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ.
వెరీ లేటెస్ట్‌గా ‘వేద’ సినిమాతో ధియేటర్లోకొచ్చింది ఈ అందాల భామ. జాన్ అబ్రహాం హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది బీ టౌన్‌లో. ప్రస్తుతం ఓ హిందీ సినిమాతో బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మ ఇంకా టాలీవుడ్ జనాల దృష్టిలో పడక పోవడం చిత్రమే.
నటన అంటే తనకెంతో డెడికేషన్ అంటోంది. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటోంది. కష్టపడి యుద్ధ విద్యలు ప్రాక్టీస్ చేయడానికైనా రెడీ అంటోంది. అంటే పీరియాడిక్ మూవీస్‌కీ సై అన్నట్లుగా సంకేతాలు పంపుతోందన్నమాట.
‘వేద’ సినిమా కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంది. అలియాభట్ అంటే తనకెంతో ఇష్టమని చెబుతోంది. నటనలో అలియా తనకు స్పూర్తి అంటోంది. అలాంటిది ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఫీలవుతున్నానంటోంది శార్వరి.
‘ఆల్ఫా’ సినిమా కోసం అలియా భట్‌తో కలిసి నటిస్తోంది శార్వరి. ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ మేల్ లీడ్ పోషిస్తున్నారు. అమ్మడి టాలెంట్‌కి టాలీవుడ్‌లో అడుగు పెడితే బాగానే వర్కవుట్ అవుతుంది. చూడాలి మరి ఆ టైమ్ ఎప్పుడొస్తుందో.!
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







