‘కన్నప్ప’.! అసలు థీమ్ ఏంటప్పా.!
- August 20, 2024
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకొస్తున్న ‘కన్నప్ప’ సినిమా అసలు ఏ థీమ్‌కి చెందిందో అర్ధం కావడం లేదు. కన్నప్ప అనగానే అందరికీ గుర్తొచ్చేది. పరమ శివుని పవిత్ర భక్తుడు భక్త కన్నప్ప. నిస్వార్ధమైన భక్తునిగా భక్త కన్నప్పను హిందువులు ఆదరిస్తుంటారు.
అయితే, మంచు విష్ణు చేస్తున్న ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏ తరహా మూవీనో అర్ధం కావడం లేదు. ఈ సినిమాలో లెక్కలేనంత మంది నటీ నటులున్నారు. వివిధ భాషల నుంచి వివిధ ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు.
అందులో ప్రబాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితర హేమా హేమీలున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. రెస్పాన్స్ మిక్స్‌డ్‌గా వినిపించిందనుకోండి.
అలాగే, కొన్ని పాత్రల తాలూకు పోస్టర్లు కూడా వచ్చాయ్. చండుడు, ముండుడు తాజాగా కంపడు అనే పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పాత్ర పోషించింది పవర్ ఫుల్ విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ముఖేష్ రిషి. అంత్యంత పురాతనమైన జాతి‘పుళిందులు. సదా శివ కొండల్లో నివసిస్తుంటారు. వంశపారంపర్యంగా పవిత్రమైన వాయులింగాన్ని సంరక్షిస్తున్న ఈ పుళింద జాతిని భద్ర గణం అని కూడా పిలుస్తారు. ఈ భద్ర గణాన్ని నడిపించే నాయకుడే కంపడు..’ అని ఈయన పాత్రకు తాలూకు ఇన్ఫో కూడా ఇచ్చారు.
ఇదంతా చూస్తుంటే అసలు ‘కన్నప్ప’ ఏ తరహా మూవీనో అర్ధం కావడం లేదు. కానీ, భారీ బడ్జెట్ మూవీ ప్యాన్ వరల్డ్ మూవీ అని జరుగుతున్న ప్రచారం వేరే లెవల్.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు