‘సరిపోదా శనివారం’.! రన్ టైమ్ సెంటిమెంట్.!

- August 21, 2024 , by Maagulf
‘సరిపోదా శనివారం’.! రన్ టైమ్ సెంటిమెంట్.!

ఈ మధ్య సినిమాలకు రన్ టైమ్ అనేది ఓ సెంటిమెంట్‌గా మారింది. ‘యానిమల్’ సినిమాకి 3 గంటల రన్ టైమ్ కలిసొచ్చిందనే చెప్పొచ్చు. మొదట్లో అంత రన్ టైమా.? వర్కవుట్ అవుతుందా.? అనుకున్నారు కానీ, సినిమా రిలీజయ్యాకా బాగానే వర్కవుట్ అయ్యింది.

అలాగే, లేటెస్ట్ మూవీ ‘కల్కి’ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమానీ హిట్టు బాట పట్టించారు ప్రేక్షకులు. ఇప్పుడు నాని సినిమాకీ ఇదే రన్ టైమ్ ఇష్యూ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

నాని తాజా సినిమా ‘సరిపోదా శనివారం’ రన్‌టైమ్ ఫిక్స్ చేశారు. 3 గంటలకు 5 నిమిషాలు తక్కువలో రన్ టైమ్ ఫిక్స్ చేశారు. దాంతో ఈ టాపిక్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే, ఈ రన్ టైమ్ అన్ని సినిమాలకీ సక్సెస్ అవుతుందా.? అంటే కాదనే చెప్పాలి.

నాని - వివేక్ ఆత్రేయ గత చిత్రం ‘అంటే సుందరానికి’ ఈ రన్ టైమే దెబ్బ తీసింది. అంతేకాదు, లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’కీ ఇదే రన్ టైమ్ దెబ్బ తీసింది.

సినిమాలో విషయముండాలి కానీ, రన్ టైమ్ సెంటిమెంట్ వర్కవుట్ కాదనేది సినీ మేధావుల అభిప్రాయం. అంతేగా.. అంతేగా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com