156 ఔషధాల పై కేంద్రం బ్యాన్!
- August 23, 2024
న్యూ ఢిల్లీ: రోగులకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందనే అనుమానాలున్న 156 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. జ్వరాలు, నొప్పులు, అలర్జీలకు రెండు మూడు ఔషధాలను కలిపి వాడే మందుల్ని కాంబినేషన్ డ్రగ్స్ అంటారు. ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలైంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ కాంబినేషన్‌లో ఉండే మెడిసిన్స్ పై నిషేధం పడింది. ఇప్పుడు ఈ మందులు మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉండవని సమాచారం.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







