సౌదీ అరేబియాకు తరలి వచ్చిన 184 విదేశీ కంపెనీలు..!
- August 24, 2024
రియాద్: సౌదీ అరేబియా పెట్టుబడి మంత్రిత్వ శాఖ (MISA) నివేదిక ప్రకారం.. 2024 ప్రథమార్థంలో పెట్టుబడి లైసెన్స్ పొందిన తర్వాత 184 విదేశీ కంపెనీలు తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను సౌదీ అరేబియాకు తరలించాయి. పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి, పెట్టుబడిదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి రాజ్యం యొక్క అవిశ్రాంత ప్రయత్నాలకు ఇది ప్రధానంగా కారణమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం 57 కంపెనీలు తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని రాజ్యానికి తరలించడానికి పెట్టుబడి లైసెన్సులను పొందాయి. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 84 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. MISA విడుదల చేసిన 2024 రెండవ త్రైమాసికానికి "సౌదీ ఎకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్ మానిటర్" నివేదిక ప్రకారం..2024 మొదటి త్రైమాసికంలో మొత్తం లైసెన్స్‌ల సంఖ్యను దాదాపు 184 లైసెన్స్‌లకు చేరుకుంది. మంత్రిత్వ శాఖ 'ఇన్వెస్టర్ విజిట్' వీసా కోసం 4,709 దరఖాస్తులను డీల్ చేసినట్టు తెలిపింది.
మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. ఈ కాలంలో జారీ చేయబడిన పెట్టుబడి లైసెన్సులు 49.6 శాతం పెరిగాయి. 2,728 లైసెన్సులకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 1,824 లైసెన్స్‌లకు అనుమతి ఇచ్చారు.
గనులు, క్వారీ కార్యకలాపాలు పెట్టుబడి లైసెన్సుల జారీ పరంగా రెండవ త్రైమాసికంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, 209.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం పెరుగుదల రేటు వరుసగా 110.5 శాతం మరియు 96.3 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్‌లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..







