హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి...
- June 17, 2016
హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ 2 ఎయిర్ఇండియా విమానాల్లో సుమారు 340 మంది యాత్రికుల చొప్పున జెద్దాకు బయలుదేరుతారన్నారు. చివరి రోజైన ఆగస్టు 28న ఒకే విమానం బయలుదేరి వెళ్తుందన్నారు.హజ్ ప్రార్థనల అనంతరం యాత్రికులు హైదరాబాద్‌కు అక్టోబర్ 4 నుంచి 11 వరకు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. హజ్ యాత్రికుల కోసం హజ్ హౌస్‌లో ప్రత్యేక క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్రికులు 2 విడతల చార్జీలను జూలై 2 వరకు చెల్లించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







