భారత ప్రధాని మోడీని ఆహ్వానించిన పాకిస్తాన్..!

- August 25, 2024 , by Maagulf
భారత ప్రధాని మోడీని ఆహ్వానించిన పాకిస్తాన్..!

పాకిస్తాన్: భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ తమ దేశానికి ఆహ్వానించింది.ఈ ఏడాది అక్టోబర్ లో జరుగబోయే కౌన్సిల్ ఆప్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కు చెందిన నేతలతో పాటు ఇస్లామాబాద్ ను సందర్శించాలని ప్రధాని మోడీకి ఆహ్వానం పంపించింది.

మోడీ ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద దాడులు, ఆర్టికల్ 370 రద్దు పై పాకిస్తాన్ విమర్శల కారణంగా ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితి క్లిష్టంగా మారింది.

ప్రధాని మోడీ అక్కడికీ వెళ్లేందుకు సిద్దంగా లేనట్టు తెలుస్తోంది. మోడీ బదులుగా భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ ను పంపించే అవకాశమున్నట్టు సమాచారం. గత ఏడాది బిస్కెక్ లో జరిగిన సీహెచ్ జీ సమావేశాలకు భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఈసారి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఏ వివరాలను చెప్పలేమని అధికారులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com