ధోఫర్ లో భారీగా పెట్టుబడులు..63 శాతం పెరిగిన దరఖాస్తులు..!

- August 25, 2024 , by Maagulf
ధోఫర్ లో భారీగా పెట్టుబడులు..63 శాతం పెరిగిన దరఖాస్తులు..!

మస్కట్: 2023 అదే కాలంలో వచ్చిన 1,897 దరఖాస్తులతో పోలిస్తే 2024 ప్రథమార్థంలో ధోఫర్ గవర్నరేట్‌లో పారిశ్రామిక లైసెన్స్ దరఖాస్తుల సంఖ్య 63 శాతం పెరిగి 3,095కి చేరుకుంది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. 2023లో అదే కాలంలో జారీ చేసి 3,963 సర్టిఫికేట్‌లతో పోలిస్తే 2024 ప్రథమార్థంలో 5,348 ధృవీకరణ పత్రాలు జారీ చేయబడ్డాయని, ఇది 34.9 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు తెలిపారు.

ధోఫర్ గవర్నరేట్‌లో వాణిజ్య రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి, 2024 మొదటి అర్ధ భాగంలో 2,560 రిజిస్ట్రేషన్‌లకు చేరుకుంది. అదే 2023లో 2,846 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఇక మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 73,520కి చేరుకున్నాయి.   2024 మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి ధోఫర్ గవర్నరేట్‌లో యాక్టివ్ లైసెన్స్‌ల సంఖ్య సుమారు 127,399కి చేరుకున్నాయని దోఫర్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ బిన్ ఖలీఫా అల్-బధ్రానీ తెలిపారు.  ఈ పెరుగుదలకు ధోఫర్ గవర్నరేట్‌లో పెట్టుబడి అనుకూల వాతావరణం, అలాగే పెట్టుబడిదారులకు అందించే సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కారణమని చెప్పారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి కృషి చేస్తోందని అల్-బధ్రానీ తెలిపారు.  30 సంవత్సరాల ఆదాయపు పన్ను మినహాయింపు, కస్టమ్స్ మినహాయింపులు, పెట్టుబడి ప్రాజెక్టుల కోసం పూర్తి విదేశీ యాజమాన్య హక్కులు, ఇతర ప్రయోజనాలతో సహా పెట్టుబడులను ఆకర్షించడానికి ధోఫర్ గవర్నరేట్ అనేక ప్రోత్సాహకాలను అందిస్తుందని అల్-బధ్రానీ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com