ఖతార్ లో ఘనంగా కెప్టెన్ విజయకాంత్ జన్మదిన వేడుకలు

- August 25, 2024 , by Maagulf
ఖతార్ లో  ఘనంగా కెప్టెన్ విజయకాంత్ జన్మదిన వేడుకలు

దోహా: ఖతార్ లో పద్మభూషణ్ కెప్టెన్ విజయకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖతార్ లోని ICC అశోకా హాల్లో జరిగిన వేడుకల్లో తమిళ కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన విశేషమైన కృషిని,  ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక నివాళి వీడియోను విడుదల చేశారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC), ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  కెప్టెన్ నటించిన సినిమాల నుండి పాటలను గాయకులు పాడి అలరించారు.  కెప్టెన్ విజయకాంత్ కు నివాళిగా     "SIGTA కెప్టెన్ అవార్డు"ను  ప్రతి సంవత్సరం  సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులకు అందజేయబడుతుందని ప్రకటించారు.  ఈ కార్యక్రమానికి తమిళ సంఘం నాయకులు, కుటుంబాలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.  మరింత సమాచారం కోసం  http://www.sigtaawards.com సందర్శించాలని లేదా SIGTA  సోషల్ మీడియా పేజీలను సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com