పవన్, ఎస్ జె సూర్య సినిమా త్వరలో...
- June 17, 2016
పెద్ద స్టార్ తో సినిమా అంటే... ఫ్యాన్స్ కు ప్రతి క్షణం క్రేజీగానే ఉంటుంది. పిక్చర్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి...ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తుంటారు. స్టోరీ ఏమిటి, హీరోయిన్ ఎవరు? మూవీ టైటిల్ ఏమిటి? ...ఇలా టోటల్ గా ఓ క్రేజీ ఎపిసోడ్ నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీపై కూడా అలాంటి క్రేజ్ ఏర్పడింది. పవన్, ఎస్ జె సూర్య సినిమా త్వరలో పట్టాలెక్కనుండగా, ఈ చిత్రానికి హుషారు అనే టైటిల్ పెడతారని ఆమధ్య కొంత ప్రచారం జరిగింది. అయితే...స్టోరీ ప్రకారం చూస్తే ఆ పేరు కుదరదన్న టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత సేనాపతి అనే పేరుతో కొంత ప్రచారం జరిగింది. ఆ పేరు కూడా వెనక్కు పోయింది. ఇప్పుడు మరో టైటిల్ తెరమీదకి వచ్చింది.పవన్ చేసేది ఫ్యాక్షన్ ప్రేమ కథా చిత్రం కనుక 'కడప కింగ్' అనే టైటిల్ అయితే సరిపోతుందని భావిస్తున్నట్టు టాక్. కడప కింగ్ అనే టైటిల్ కు కొంత బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి కడప కింగ్ పేరును రిజిస్టర్ చేయించారట. దాంతో పవన్ కల్యాణ్ న్యూ మూవీ పేరు కడప కింగ్ అని ప్రచారం జరుగుతోంది. ఫ్యాక్షనిజంతో ముడిపడి వున్న కథ కాబట్టి ఆ టైటిల్ నే ఫిక్స్ చేయవచ్చని కూడా తెలుస్తోంది. ఇక ఈ మూవీ హీరోయిన్ ఎవరా అన్నది కూడా ఇంతవరకు సస్పెన్స్ లోనే ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ నే తీసుకోవచ్చని చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









