ఒమన్ లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి..!
- August 26, 2024
మస్కట్: వచ్చే వారం పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత స్కూల్ బస్సులను నియంత్రించే కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.2024/2025 కొత్త విద్యా సంవత్సరానికి సన్నాహకంగా, పాఠశాల విద్యార్థుల రవాణా అనేది విద్యా మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యతగా ఉందన్నారు. కాంట్రాక్టులను పునరుద్ధరించడం, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త రవాణాను అందించడం, రహదారి భద్రతపై డ్రైవర్లు , విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలను అమలు చేయడంతో సహా పాఠశాల రవాణా నాణ్యత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రాథమిక విధానాలపై దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుత పాఠశాల రవాణా మార్గాలను పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేసినట్టు, 20,000 కంటే ఎక్కువ పాఠశాల బస్సుల కోసం ఒప్పందాలను పునరుద్ధరించిందని ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ డైరెక్టరేట్-జనరల్ డైరెక్టర్ జనరల్ ఖమీస్ అల్-హదీది వివరించారు. రానున్న ఐదేళ్లలో మొత్తం 5,000 పాఠశాల రవాణా వాహనాలు వస్తాయని,2024/2025 విద్యా సంవత్సరంలో 1,000 వాహనాలు తీసుకురానున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు