భద్రతాదళాలపై విరుచుకుపడ్డ బొకోహరామ్‌ ఉగ్రవాదులు..

- June 18, 2016 , by Maagulf
భద్రతాదళాలపై విరుచుకుపడ్డ బొకోహరామ్‌ ఉగ్రవాదులు..

బొకోహరామ్‌ ఉగ్రవాదులు మరోసారి భద్రతాదళాలపై విరుచుకుపడ్డారు. ఈశాన్య నైగర్‌లో జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు ప్రాణాలొదిలారు. ఎస్‌ఐటీఈ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌, స్థానిక మిలిటరీ వర్గాలు ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. నైగర్‌లోని ఓ టౌన్‌లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అదే సమయంలో బొకోహరామ్‌ ఉగ్రవాదులు మిలిటరీ బరాక్స్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. మిలిటెంట్లు ఆయుధాలు దోచుకుని వెళ్లినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పర్యటనలో ఉన్న మంత్రులెవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇస్లామిస్ట్‌ చొరబాటుదారుల వల్ల ఇల్లూ వాకిలి వదులుకుని వలసబాట పట్టిన శరణార్థులు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com