‘కన్నప్ప’ నుంచి మరో కొత్త పోస్టర్.! ఈ సారి ఎవరిదో తెలుసా.?

- August 27, 2024 , by Maagulf
‘కన్నప్ప’ నుంచి మరో కొత్త పోస్టర్.! ఈ సారి ఎవరిదో తెలుసా.?

మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీ ‘కన్నప్ప’ నుంచి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ కిక్కిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ క్యారెక్టర్లు, డిఫరెంట్ ఆర్టిస్టులూ.. డిఫరెంట్ నేమ్స్.. ప్రతీ పోస్టరూ ఆసక్తికరంగానే అనిపిస్తోంది.

తాజాగా ‘తిన్నడు’ అనే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాత్ర పోషిస్తుందెవరో కాదు, మంచు విష్ణు ముద్దుల తనయుడు అప్రమ్. ఈ తిన్నడే పెద్దయ్యాకా కన్నప్పగా మారతాడు. అదే లీడ్ రోల్ మంచు విష్ణు పోషించే పాత్ర.

ఈ పాత్రలో అప్రమ్ చాలా మెచ్చూర్డ్‌గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ టైమ్ కెమెరాని ఫేస్ చేస్తున్నాడు. అయినా చాలా కాన్ఫిడెంట్‌గా స్క్రీన్‌పై కనిపిస్తున్నాడు అప్రమ్. తన కొడుకుని ఫస్ట్ టైమ్ ఇలా ఈ పాత్రలో స్క్రీన్‌పై చూసుకుని మంచు విష్ణు మురిసిపోతున్నాడు.

ఇక, ఈ సినిమా విషయానికి వస్తే, పలు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలవుతోంది. భారీ బడ్జెట్‌తో ఓన్ బ్యానర్‌లో రూపొందిస్తున్నారు మంచు ఫ్యామిలీ.

వివిధ భాషల నుంచి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అందులో ప్రబాస్ వంటి ప్యాన్ ఇండియా స్టార్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా వుండడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com