‘మిరాయ్’కీ అదే కాన్ఫిడెన్స్.! తేజ సజ్జా తగ్గేదేలే.!
- August 27, 2024
కుర్ర హీరో తేజ సజ్జాకి ‘హనుమాన్’ కెరీర్ బిగ్గెస్ట్ హిట్. అనూహ్యమైన విజయం దక్కింది ఆ సినిమాతో తేజ సజ్జాకి. నిజానికి ఆ సినిమా రిలీజ్ చేసుకునేందుకు ‘హనుమాన్’ టీమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అందరికీ తెలిసిందే.
అసలు ధియేటర్లే ఇవ్వలేదు. కట్ చేస్తే, సూపర్ డూప్ హిట్.. బాక్సాఫీస్‌కి కాసుల వర్షం కురిపించిందీ సినిమా. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ లిస్టులో ‘హనుమాన్’ వుంటుంది.
ఇక వచ్చే ఏడాదిలో చాలానే పెద్ద సినిమాలున్నాయ్. అందులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ ‘రాజాసాబ్’ కూడా వుంది. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే, తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా కూడా అదే నెలలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
ఏప్రిల్ 18న ‘మిరాయ్’ రిలీజ్ కానుంది. కాగా, ‘మిరాయ్’కీ ధియేటర్ల విషయంలో అలాగే చేస్తారా.? అంటే ఏమో చెప్పలేం అలాగే చెయ్యొచ్చు. కానీ, తేజ సజ్జా మాత్రం ఎలాంటి బెరుకూ లేకుండా నాకు తగ్గ ధియేటర్లే నాకు దక్కుతాయ్.
ఖచ్చితంగా మళ్లీ హిట్టు కొడతాం అంటూ బీభత్సమైన నమ్మకంతో వున్నాడు తేజ. ‘హనుమాన్’ ఊపులోనే ‘మిరాయ్’ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. మామూలు రెస్పాన్స్ రాలేదీ సినిమాకి. సో, అదే నమ్మకం, అదే ధైర్యంతో తేజ ‘మిరాయ్’ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నాడు. చూడాలి మరి, తేజ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో.?
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..