అబుదాబిలో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పొడిగింపు..!
- August 27, 2024
యూఏఈ: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటీ మహిళలకు పొడిగించిన ప్రసూతి సెలవుల వివరాలను అబుదాబి ప్రకటించింది. ముందుగా ప్రకటించిన 90 రోజుల ప్రసూతి సెలవులు సెప్టెంబర్ 1, 2024 నుంచి ప్రసవించే తల్లులకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.అబుదాబిలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటి మహిళలకు ప్రసూతి సెలవులను 60 రోజుల నుండి 90 రోజులకు పొడిగించినట్లు అధికారులు జూలైలో ప్రకటించారు.
ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఎల్లప్పుడూ మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు అర్హులు అయితే, ప్రైవేట్ సంస్థల్లోని మహిళలకు సాధారణంగా 60 రోజులు - 45 రోజులు పూర్తిగా వేతనం మరియు 15 రోజులు సగం జీతం, యూఏఈ లేబర్ లా ప్రకారం మంజూరు చేస్తారు. కొత్త నిర్ణయం ప్రకారం, ప్రైవేట్ రంగంలో ఉన్న ఎమిరాటీ తల్లులు కూడా 90 రోజుల సెలవును పొందవచ్చు. అబుదాబి ఎర్లీ చైల్డ్‌హుడ్ అథారిటీ ద్వారా ప్రారంభించబడే 'హోమ్ విజిట్ సర్వీస్' కింద మొదటి వారాలలో కొత్త తల్లులకు కూడా సహాయం పడనుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు