కొత్త టోల్ గేట్లు..RTAకి Dh2.73 బిలియన్ చెల్లింపు..!
- August 28, 2024
యూఏఈ: దుబాయ్‌కి చెందిన టోల్ గేట్ ఆపరేటర్ సలిక్ కంపెనీ తన ఆర్థిక నివేదికను తాజాగా సవరించింది. 2024లో ఆదాయంని 7-8 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. బిజినెస్ బే మరియు అల్ సఫా సౌత్‌లోని కొత్త టోల్ గేట్లు ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి పనిచేస్తాయని, మొత్తం టోల్ గేట్లను 8 నుండి 10కి తీసుకుంటామని తెలిపింది.
2024 ప్రథమార్థంలో సలిక్ తన ఎనిమిది టోల్ గేట్ల గుండా 238.5 మిలియన్ వాహనాలు వెళ్లాయని, ఫలితంగా Dh1.1 బిలియన్ల ఆదాయాలు వచ్చాయని తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.6 శాతం ఆదాయం పెరిగిందని వెల్లడించింది. మొత్తం రాబడిలో 87.1 శాతంతో కూడిన టోల్ వినియోగం ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 4.9 శాతం పెరిగి Dh953.8 మిలియన్లకు చేరుకుందని పేర్కొంది.
రెండు కొత్త టోల్ గేట్ల విలువ మొత్తం 2.734 బిలియన్ దిర్హామ్‌లుగా నిర్ణయించినట్లు సలిక్ కంపెనీ తెలిపింది.దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ వెబ్సైట్లో ప్రచురించిన ఒక ప్రకటనలో బిజినెస్ బే గేట్ విలువ 2.265 బిలియన్ దిర్హాములు మరియు అల్ సఫా సౌత్ గేట్ విలువ 469 మిలియన్ దిర్హాములుగా తెలిపింది. సాలిక్ నవంబర్ 2024 చివరి నాటికి ప్రారంభించి ఆరు సంవత్సరాల వ్యవధిలో రెండు కొత్త గేట్లకు RTA చెల్లించనున్నారు. వార్షిక వాయిదా Dh455.7 మిలియన్లు, ప్రతి ఆరు నెలలకు Dh227.9 మిలియన్ల చొప్పున రెండు సమాన వాయిదాలలో చెల్లిస్తామని సలిక్ యొక్క CEO ఇబ్రహీం సుల్తాన్ అల్ హద్దాద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు