ఒమన్‌లో O (+ve) రక్తదాతల కోసం DBBS అప్పీల్..!

- August 28, 2024 , by Maagulf
ఒమన్‌లో O (+ve) రక్తదాతల కోసం DBBS అప్పీల్..!

మస్కట్: బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో O (+ve) బ్లడ్ అవసరం ఉందని, దాతలు వెంటనే స్పందించి రక్తదానం చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS) అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. " O + రక్తం చాలా అత్యవసరం. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయడానికి దాతలు వెంటనే రావాలి. మీ రక్తదానం మాకు చాలా అవసరం." అని DBBS ఒక ప్రకటనలో అప్పీల్ చేసింది.  

బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌ సమయాలు: శనివారం నుండి గురువారం వరకు, ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు,  శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటుంది.మరింత సమాచారం కోసం, రక్తదానం కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి 94555648లో WhatsApp ద్వారా సంప్రదించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com